రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి (NH65) BHEL కల్వర్టు నుండి నాలా మీదుగా శ్రీదేవి థియేటర్ రోడ్డు వరకు నూతనంగా చేపట్టబోయే లింక్ రోడ్డు పనులను ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నూతనంగా చేపట్టబోయే లింక్ రోడ్డు పనుల ద్వారా ప్రజలకు ట్రాఫిక్ తగ్గి సమయం, ఇంధనం ఆదా అవుతాయ‌ని అన్నారు. లింక్ రోడ్డు ప్రతిపాదనల‌ను సిద్ధం చేసి త్వరితగతిన పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్ట్స్ అధికారులు DE శిరీష, నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here