శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్కు చెందిన ప్రముఖ మెజిషియన్ డాక్టర్ బీఎల్ఎన్ రాజును ఘనంగా సన్మానించారు. శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రి శ్రీజ్ఞాన సరస్వతి ఘాట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై సన్మానించారు. ఈ సందర్భంగా బీఎల్ఎన్ రాజు మ్యాజిక్ షోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని మ్యాజిక్ లను వీక్షించారు.






