చందాన‌గ‌ర్ – అమీన్‌పూర్ రోడ్డుతో తీర‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి (NH65) శ్రీదేవి థియేటర్ రోడ్డు నుండి అమీన్ పూర్ వరకు రూ. 45 కోట్ల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే 2.7 KM పొడవైన 4 లేన్ రహదారి విస్తరణ, 2 లేన్ సర్వీస్ రహదారి విస్తరణ పనులను CMC కమిషనర్ సృజన, డీసీ శశిరేఖ, సిసిపి వెంకన్న, ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జాతీయ రహదారి (NH65) శ్రీదేవి థియేటర్ రోడ్డు నుండి అమీన్ పూర్ వరకు రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే 2.7 KM పొడవైన‌ 4 లేన్ రహదారి విస్తరణ, 2 లేన్ సర్వీస్ రహదారి విస్తరణ పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలని, పనులలో అలసత్వం ప్రదర్శించకూడదని, త్వరితగతిన రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలని అన్నారు. రోడ్డు విస్తరణ వలన ట్రాఫిక్ తగ్గి సమయం, వాహనాల ఇంధనం ఆదా అవుతాయ‌ని, ప్ర‌జలకు కొంత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్ట్స్ అధికారులు SE శ్రీలక్ష్మి, EE నామ్యా, DE శిరీష, AE శివ కృష్ణ యాదవ్, DE శ్రీదేవి , టౌన్ ప్లానింగ్ అధికారులు ACP రాణి, TPS రమేష్, నాయకులు అక్బర్ ఖాన్ , నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి, అంజద్ , కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here