శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 6 ఫిర్యాదులు రాగా, హెల్త్ అండ్ శానిటేషన్‌కు 2, ఇంజినీరింగ్ వింగ్‌కు 3 మొత్తం 11 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.






