శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగి పల్లపు వడ్డే యాదయ్య పదవీ విరమణ పొందిన సందర్భంగా ఆయనకు బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఎంప్లాయిస్ యూనియన్ హక్కుల కోసం పోరాటం చేసిన యాదయ్య బీసీల కోసం తన వంతు పాత్ర పోషించాలని ఈ సందర్భంగా రామచందర్ యాదవ్ అన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, కష్టసుఖాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ సిపి ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు పెరుగు ఐలేష్ యాదవ్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు నరసింహులు యాదవ్, బీసీ జిల్లా నాయకుడు కే నరసింహ యాదవ్, బుచ్చయ్య, తెలంగాణ రాష్ట్ర యాదవ జేఏసీ ఉపాధ్యక్షుడు పాములేటి యాదవ్, వంశీ యాదవ్, పల్లపు వడ్డే సంఘం నాయకులు, తెల్లాపూర్ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.






