శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని PJR ఎన్క్లేవ్ రోడ్డు లో ఉన్న జగద్రక్షక శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయము లో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి జన్మనక్షత్ర ( ఉత్తరాఫల్గుణీ నక్షత్ర) పూజ మహోత్సవం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ గురు స్వామి, స్థానిక భక్తులు పాల్గొన్నారు.






