శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ బుధవారం పరిశీలించారు. హైటెక్‌సిటీ-అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనులు, గుర్నాథం చెరువు వద్ద ఎస్ఎన్‌డీపీ బాక్స్ డ్రెయిన్ పనులు తదితర అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. పనుల పురోగతిపై ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డిప్యూటీ ఈఈలు, ఏసీపీ, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.






