శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): తిరుమల గిరిపై కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శేరిలింగంపల్లి ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్ర తిరుమల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ కి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుమల నుంచి చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నట్లు వెల్లడించారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ లో జరగనున్న ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లిలోని అన్ని డివిజన్ లలో గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.






