రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను నాణ్య‌త‌తో పూర్తి చేయాలి: మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్‌లోని శ్రీరామ్ నగర్ ఏ బ్లాకులో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ స్వయంగా పర్యవేక్షించి, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. పనులు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించిన హమీద్ పటేల్ డిపార్ట్మెంట్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని ఈ సందర్బంగా సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కే. శివకుమార్, తిరుపతి యాదవ్, టీవీ రమణ, ప్రసాద్ రావు, రత్న రాజు, డా. మల్లేష్, విజయ్ కుమార్ రెడ్డి, షేక్ రఫీ, విజయ లక్ష్మి, రెహమాన్, వాజీద్, రామకృష్ణ, ధనుంజయ్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here