గాయత్రి ఎస్టేట్స్ కాలనీ పార్కు అభివృద్ధికి కృషి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎస్టేట్స్ లో CSR నిధుల ద్వారా నూతనంగా ఏర్పాటు చేయబోయే పార్కు అభివృద్ధి పనులను స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ గాయత్రి ఎస్టేట్స్ కాలనీలోని పార్కును స్థానికులు, వృద్ధులు, పిల్లలు వినియోగించుకునేలా సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అభివృధి పనులను చేపట్టడం జరిగింద‌ని అన్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్, బెంచీలు, లైటింగ్ సదుపాయాలు, గ్రీనరీ, పిల్లల ఆటపరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశామ‌న్నారు. ఈ కార్యక్రమంలో CSR సంస్థ ప్రతినిధులు, కాలనీ వాసులు నరేందర్, హరి, హరీష్, సుధీర్, రాజు, సురేంద్ర, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here