శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వంలో భాగంగా మాతృ శ్రీ నగర్ వద్ద ఉన్న చైతన్య కాలేజీలో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మాహాభియన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా లక్ష్మణ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జి ఆలె భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ తరగతులు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, బీజేపీ సిద్ధాంతాలు, దేశ చరిత్ర, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవలో ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవచ్చని, మంచి నాయకుడిగా ఎదగాలంటే సరైన శిక్షణ కూడా అవసరమని సూచించారు. బీజేపీ సిద్ధాంతం ఎప్పుడూ ఒక్కటేనని, దేశమంతా ఒక్కటిగా ఉండాలని, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మైపాల్ రెడ్డి, అశోక్ కురుమ, అనిల్ గౌడ్, మాణిక్ రావు, దుర్గారావు, కృష్ణంరాజు, స్రవంతి, పద్మ, బుచ్చిరెడ్డి, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






