శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో శేరిలింగంపల్లి ఉద్యమకారుడు చిర్రా రవీందర్ యాదవ్ భేటీ అయ్యారు. లోక్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాని చిర్రా రవీందర్ యాదవ్ సన్మానించారు. అనంతరం గవర్నర్ కి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. తెలంగాణలో తొలిసారి ఘనంగా మహాష్టమి ఫలహార వేడుకలు జరుగుతుండగా చైత్ర నవరాత్రి మహాష్టమి ఫలహార వేడుకల్లో గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయనతోపాటు చిర్రా రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ దివ్యశక్తి ఆరాధనకు ప్రతీకగా మహాష్టమి నిలుస్తుందని వెల్లడించారు. అమ్మవారి శక్తి స్వరూపమైన దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ, మనలోని అజ్ఞానం, అహంకారం, దుర్గుణాలను తొలగించుకోవాలని స్పష్టం చేశారు.






