శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీ, ఎన్టీఆర్ నగర్, నవోదయ కాలనీ, మంజీర డైమండ్ హిట్స్, నల్లగండ్ల హుడా కాలనీ, నేతాజీ నగర్, నల్లగండ్లలోని అపర్ణ సైబర్ జోన్, అపర్ణ సరోవర్ ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ కోసం అవతరించిన మహావిష్ణువు అవతారమే శ్రీరాముడు అని తెలిపారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






