శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ అధ్యక్షుడు అట్టేపల్లి రామప్రభు అధ్యక్షత వహించారు. ఈ పవిత్ర వేడుకలో సీతమ్మ తరఫున అట్టేపల్లి పురుషోత్తం, దయాకర్, కుటుంబ సభ్యులు, రాముడి తరఫున నాగిశెట్టి ప్రసాద్ పిల్లి నాగరాజు, కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మువ్వ సత్యనారాయణ, మియాపూర్ మాజీ కార్పొరేటర్ ప్రసాద్, ఉప్పలపాటి శ్రీకాంత్, రఘునాథ్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, రామకృష్ణ గౌడ్, మహేష్ యాదవ్, గంగాధర్, నాగులు పటేల్, B S N కిరణ్ యాదవ్, అట్టేపల్లి పురుషోత్తం, సమ్మెట ప్రసాద్ , అట్టేపల్లి శ్రీరాములు , అట్టేపల్లి దయాకర్ , పిల్లి నాగరాజు, డాక్టర్ రవికుమార్, రాజేంద్ర ప్రసాద్ చౌదరి, మొహమ్మద్ కాజా, నాగిశెట్టి వినీత్, తంగెళ్ల సాయి తేజ, అట్టేపల్లి ప్రశాంత్ నాయుడు, చంద్రహాస్, రాజశేఖర్, గిరి, వినోద్, శ్రీకాంత్ , చంద్రిక, కల్పన, ప్రీతి, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, కబీర్, ఎఆర్ పి టీం సభ్యులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో కాలనీ నివాసితులు భక్తిశ్రద్ధలతో పాల్గొని, శ్రీ సీతారాముల వారి దివ్య కల్యాణాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి, పాల్గొన్న భక్తులకు భోజన సదుపాయం కల్పించారు.





