శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన హాకీ ఇండియా అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో క్రీడా శాఖామంత్రి రక్ష నిఖిల్ ఖాడ్సేతో కలిసి బెస్ట్ ప్లేయర్ అవార్డు పొందిన హాకీ జాతీయ క్రీడాకారులు హర్మోన్ ప్రీత్ సింగ్, మాన్ ప్రీత్ సింగ్ లకు తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ చెక్కులను అందజేశారు. తెలంగాణలో మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లను నిర్వహించడం జరుగుతుందని కొండా విజయ్ కుమార్ తెలిపారు.






