అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

  • ఉచిత ఆంబులెన్స్ సేవలను ప్రారంభించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు, పురుషోత్తం ఆధ్వర్యంలో మహిళల కోసం విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గత 15 రోజులుగా మియాపూర్ పరిధిలోని వివిధ కాలనీలలో మహిళల కోసం వినోదాత్మక గేమ్స్ , ప్రతిభా పోటీలు నిర్వహించి మహిళలలోని ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేక ప్రయత్నం చేశారు. ఈ పోటీలలో విజేతలకు మొత్తం 24 మొదటి బహుమతులు (ప్రతి ఒక్కరికీ రూ.5,000 విలువైన బహుమతి), 24 రెండవ బహుమతులు (ప్రతి ఒక్కరికీ రూ.3,000 విలువైన బహుమతి) అందజేశారు. అదనంగా పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహకంగా చీరలను పార్టిసిపేషన్ గిఫ్ట్‌లుగా 800 మందికి అందజేశారు.

మహిళ సంకల్పిస్తే ఏదైనా సాధ్యం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్ కమ్యూనిటీ హాల్ లో జరిగింది. కార్యక్రమంలో బహుమతి ప్రదానోత్సవం, విందు కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా మియాపూర్ ప్రాంత ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉచిత ఆంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సేవను హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ కె మధుసూదన్, అర్జున అవార్డు గ్రహీత జీవంజీ దీప్తి, డాక్టర్ జె బి రావు, మియాపూర్ లా అండ్ ఆర్డర్ ఎస్.ఐ వెంకటేష్, కిమ్స్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య ప్రియ, మియాపూర్ జడ్పీహెచ్‌ఎస్ ప్రిన్సిపాల్ వసుంధర, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ హాజ‌ర‌య్యారు.

ఈ కార్య‌క్ర‌మంలో బోయిని మహేష్ యాదవ్, నిమ్మల రామకృష్ణ గౌడ్, మోహన్ ముదిరాజ్, మొవ్వ సత్యనారాయణ, పురుషోత్తం యాదవ్, ఓం ప్రకాష్, కృష్ణ పటేల్, డిఎస్ ఆర్ కె ప్రసాద్, బాబ్జి, సుధీర్, వినయ్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, ఏఆర్ పి టీం సబ్యులు, అట్టేపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధికి పునాది అని, మహిళా సాధికారతే దేశ అభివృద్ధికి మార్గం అని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రతి మహిళకు ధన్యవాదాలు తెలియజేశారు. వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here