శేరిలింగంపల్లి, మార్చి 14 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో నివసించే రవీందర్ నాయక్ కుమారుడు పాత్లవత్ ఓంప్రకాష్ నాయక్ అనే విద్యార్థికి విద్యాభివృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో, తన సొంత నిధులతో ల్యాప్‌టాప్‌ను, స్థానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులు చదువులో మరింత ముందుకు సాగాలని, డిజిటల్ విద్యను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. నేటి కాలంలో విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎంతో అవసరమని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా ఆధునిక విద్యా వనరులను పొందేలా సహకరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామి నాయక్, రవీందర్ నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, గోపి నాయక్, సుధాకర్, అబ్రహాం, మోహన్ నాయక్, భీమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.






