శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ ఇంటలెక్షువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ (BPF) సంయుక్త ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లాబ్ ప్రెస్ లో బైరు శేఖర్ గంగపుత్ర అధ్యక్షతన చర్చను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని, బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, జనగణనలో కులగణన అంశాన్ని పొందుపరచాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటాని రూపొందించాలనే అంశాలపై బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ టీ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొని చర్చించారు.

బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ఛైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్స్ అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్ట విజయకుమార్ గౌడ్ , అంబాల నారాయణ గౌడ్, బత్తిని కీర్తి లత, దామోదర్, నాగభూషణం జంగం, ఎర్రమాద వెంకన్న నేత , చెన్నై శ్రీకాంత్ , లింగేష్ యాదవ్, కర్నాటి మనోహర్, రాపోలు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్ లో వెంటనే చేర్చాలని, కేంద్ర ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా జరగబోయే జాతీయ జనగణనలో బీసీలను కులాల వారీగా లెక్కించాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కేటాయించాలని, బీసీల రక్షణకై ప్రత్యేక బీసీ రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని, బీసీల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం కనీసం రూ.50,000 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, బీసీ కార్పొరేషన్లకు అవసరమైన బడ్జెట్ నిధులు వెంటనే కేటాయించాలని, బీసీలపై అమలవుతున్న క్రిమిలేయర్ విధానాలను వెంటనే ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.





