సాయి జ్యోతి నగర్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, మార్చి 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మక్తా మహబూబ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి జ్యోతి నగర్ కాలనీలో నెల‌కొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలసి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. మక్తా మహబూబ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి జ్యోతి నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలోని స‌మస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకుడు ప్రతాప్ రెడ్డి, కాలనీ వాసులు యాసిన్, రాజు, రజాక్, ధర్మేందర్, వెంకటేష్, రామచందర్, బాసి రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఆసమ్, ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here