శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డీసీ శశిరేఖతోపాటు పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొని పలు ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 14 ఫిర్యాదులు రాగా హెల్త్ అండ్ శానిటేషన్ (ఎస్‌డబ్ల్యూఎం) విభాగంలో 1, ఇంజినీరింగ్ విబాగంలో 4 మొత్తం కలిపి 19 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని డీసీ శశిరేఖ సంబంధిత విభాగాలకు చెందిన అధికారులను ఆదేశించారు.






