మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దుండ్ర కుమారస్వామి

శేరిలింగంప‌ల్లి, మార్చి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లోని ఆవాస్ హోటల్లో ప్రముఖ సంస్థ బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. సమాజంలోని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను ఈ సందర్భంగా గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళల సాధనలను అభినందిస్తూ, వారి సేవలకు కృతజ్ఞతగా పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆవాస్ హోటల్ జనరల్ మేనేజర్ స్వప్నకు పురస్కారం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సన్మానం జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ప్రముఖ ఫిలిం డైరెక్టర్ శ్రీవాసు చేతుల మీదుగా జరిగింది. మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉండి సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని వారు అభినందించారు. మహిళల సాధికారతే సమాజ పురోగతికి పునాది అని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here