శేరిలింగంపల్లి, మార్చి 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్ లోని ఈద్గా వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టబోయే సీసీ రోడ్డు, సీసీ ఫ్లోరింగ్ నిర్మాణం పనులను స్థానిక ముస్లింలతో కలిసి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈద్గా ఒకేసారి వేల సంఖ్యలో ప్రజలను ఏకం చేస్తుందని ఇది కుల, మత, ఆర్ధిక వ్యత్యాసాలు లేకుండా అందరూ భుజం భుజం కలిపి ప్రార్థించేలా చేస్తూ సామాజిక సమానత్వాన్ని చాటే ఒక పవిత్రమైన ప్రదేశమని అన్నారు. అందులో భాగంగా ఈద్గా కు మెరుగైన వసతులు కల్పించాలని ప్రత్యేక చొరవ తీసుకుని ఎమ్మెల్యే సహకారంతో, అధికారులతో చర్చించి సీసీ ఫ్లోరింగ్ వేయిస్తున్నట్లు తెలిపారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని, భవిష్యత్తులో కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చేసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇక్బాల్, జాకేర్, గఫుర్, సయ్యద్ గఫర్, అషు, ఇర్ఫాన్, ఐవైసీ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ ఇర్ఫాన్ ఖాన్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, అజామ్, ముక్రమ్, అజీజ్, షైబాజ్, షాదిక్, సల్మాన్, సత్తార్, ఖాదర్ ఖాన్, రైమత్, దస్తగిర్, జాఫర్, ముంతాజ్ బేగం, అలీం, రమేష్, సుధాకర్ రెడ్డి, మహేష్ చారీ, సందీప్, మహేందర్ సింగ్, దావుద్ తదితరులు పాల్గొన్నారు.





