ప్రశాంత్ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి: ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మార్చి 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు, జిహెచ్ఎంసి అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రశాంత్ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు, జిహెచ్ఎంసి అధికారులతో కలసి పరిశీలించడం జరిగింద‌ని, ప్రశాంత్ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని, కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు జగదీష్, అన్వర్, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, కాలనీ వాసులు రవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here