శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు, లోకసభ విప్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, సీనియర్ నాయకుడు సీతారామ రాజు, ఇతర నాయకులతో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డికి రవికుమార్ యాదవ్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో సుదీర్ఘంగా సేవలందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.






