మియాపూర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో డీసీ శ‌శిరేఖ స‌మీక్షా స‌మావేశం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో ప‌లు శాఖ‌ల‌కు చెందిన అధికారులు, సిబ్బందితో డిప్యూటీ క‌మిష‌న‌ర్ శ‌శిరేఖ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఆర్పీలు, ఎస్ఎఫ్ఏలు, ఎస్సార్‌పీలు, రాంకీ ప్ర‌తినిధులు, ఎస్ఎస్‌లు, ఎస్‌డ‌బ్ల్యూఎం ఏఈ, డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చెత్త సేక‌ర‌ణ‌లో స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల స‌మ‌న్వ‌యం, రోజువారి చెత్త సేక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై డీసీ స‌మీక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here