గౌలిదొడ్డిలో ఆర్.ఎల్.వై. వస్తాద్ చారిటబుల్ ట్రస్ట్ క్రికెట్ టోర్నమెంట్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల డివిజన్‌లోని గౌలిదొడ్డిలో ఆర్.ఎల్.వై. వస్తాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని గచ్చిబౌలి మాజీ వార్డు సభ్యులు రాగం జంగయ్య యాదవ్, రాగం హరి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించారు. టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్‌ను 8 ఓవర్ల చొప్పున నిర్వహించారు. ఆదివారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా జరిగాయి. సెమీఫైనల్‌కు నాలుగు జట్లు అర్హత సాధించగా, అందులో రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫైనల్ పోటీలో రైజింగ్ స్టార్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఛాలెంజర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేత రైజింగ్ స్టార్ జట్టుకు రూ.10,000 నగదు బహుమతి, రన్నరప్ ఛాలెంజర్స్ జట్టుకు రూ.6,000 నగదు బహుమతి అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here