అన్ని వర్గాల ప్రజలకు సమానమైన గౌరవం అందేలా కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ లో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ సద్గురు రవిదాస్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా, మానవత్వమే పరమావధిగా జీవించాలని బోధించిన గొప్ప సంస్కర్త సంత్ రవిదాస్ మహారాజ్ అని కొనియాడారు. రవిదాస్ మహారాజ్ ఆశయాల స్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన గౌరవం, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, అక్తర్, మల్లేష్, శ్రీధర్ , సంజయ్, మోచి సంఘం అధ్యక్షుడు నాందేవ్, సభ్యులు విశ్వనాథ్, ప్రభు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here