శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ హుడా కాలనీలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అట్టేపల్లి రామప్రభు హాజరై రక్తదానం చేసిన దాతలను అభినందించారు. అనంతరం రామప్రభు మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని, యువత సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ శిబిరంలో శైలజ, 25 మంది దాతలు పాల్గొన్నారు.






