శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, బంజారాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం మనందరం కృషి చేయాలి అని అన్నారు. భారత సాంస్కృతి సంప్రదాయాలను కాపాడిన సేవాలాల్ మహరాజ్ దేశం, ధర్మం పట్ల ఆయన ఎన్నో సేవలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ ముదిరాజ్, గంగాధర్, స్వామి నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, గోపి నాయక్, మోహన్ నాయక్, కృష్ణ నాయక్, లక్సమన్ నాయక్, రెడ్యానాయక్, హనుమంతు నాయక్, శంకర్ నాయక్, హరి, శివ, కమలాకర్, రవి నాయక్, రాజు నాయక్, లకపతి నాయక్, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






