శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం భక్తులకు 100 మందికి పైగా అన్నదాన ప్రసాదం వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా పారాయణ కార్యక్రమంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తదుపరి నృత్య కూచిపూడి నాట్యాలయం ఆధ్వర్యంలో నాట్య గురువు వెన్నెల నెరెళ్ల మార్గదర్శకత్వంలో శిష్యులు స్వామి వారికి భక్తిపూర్వక కూచిపూడి నృత్యార్చన అర్పించారు. ఈ కార్యక్రమంలో మధుశాలిని, శ్రీ వైష్ణవి, సామన్వి, సుదీక్ష, వైష్ణవి, ప్రమద, సహస్ర, హనిషా, వాసవి, మీరా, సాన్వి, శర్మిష్ఠ, హర్షిత, నిత్యశ్రీ, సమ్యుక్త, జె. నిత్య, త్విషా, భువిక, తన్మయి, జిషా, సౌమ్య, సంజన, జాహ్నవి, ఆధర్షి, ప్రియాన్షి, మీనాక్షి, లతిక, మన్విత, ధృవి, శతాక్షి, స్పూర్తి, అహనా, ఋత్విక, శ్రీనిధి, సౌమ్య సమృద్ధి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిష్యులు భజ మనసా విఘ్నేశ్వరా, ముద్దుగారే యశోద, తిరు తిరు జవారాల, పిడికిట తలంబ్రాల, పరమ పురుషుడు, బ్రహ్మమొక్కటే, మలై మాట్రినాల్, జగడపు చనువుల, డోలాయం, మంగళం అనే అన్నమయ్య సంకీర్తనలకు కూచిపూడి నృత్యరూపంలో భావాభినయాన్ని ప్రదర్శించి కూచిపూడి నృత్యంతో స్వామివారికి నృత్య కైంకర్యాన్ని సమర్పించారు. శిష్యుల నృత్యాలు లయ, భావ, అభినయ సమన్వయంతో సాగి భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచాయి.
అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ నిర్వాహకులు కళాకారులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికను అందించి ప్రశంసించారు. కార్యక్రమం చివరగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.





