శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): ఎంసిపిఐయు పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ 4వ వర్ధంతి సందర్భంగా రాజకీయాలు ప్రజల కర్తవ్యం అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మియాపూర్ లో నిర్వహించిన కార్యక్రమాలలో ముందుగా మియాపూర్ క్రాస్ రోడ్డు వద్ద తాండ్ర కుమార్ భారీ స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా ముజాఫర్ అహ్మద్ నగర్ లోని ఆఫీస్ వద్దకు తరలి వెళ్లారు. అనంతరం నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఓంకార్ తాండ్ర కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలక పార్టీల అనైతిక రాజకీయాల పై ప్రజలు పోరాడాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మూడోసారి అధికారంలో ఉన్న బిజెపి తమ తప్పుడు విధానాలను కప్పించుకోవడానికి సామ్రాజ్యవాది ట్రంపు ఆంక్షలకు తలోగ్గి మన దేశాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు.

ఎంసిపిఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యంసిపిఐ (యు) కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, వి తుకారం నాయక్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, తాండ్ర కళావతి, పుష్ప, కర్ర దానయ్య, ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, యల్ రాజు, సభ్యులు యం యాదగిరి, కన్నా శ్రీనివాస్, మధుసూదన్, రంగా స్వామి, శ్యామ్ సుందర్ విమల, శేరిలింగంపల్లి వామపక్ష నాయకులు సిపిఎం కె కృష్ణ, సిపిఐ చందు యాదవ్, మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు శివాని, జి లలిత, ఎం డి సుల్తానా బేగం, గూడ లావణ్య, బి అరుణ, డి నర్సింహా, వి అనిత, నాగభూషణం, శ్రీనివాస్, భూసాని రవి, యం వై కుమార్ పాల్గొన్నారు.






