బస్తీ దవాఖాన, అంగన్‌వాడీ అభివృద్ధికి చేయూత: కట్ల చంద్రశేఖర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్‌ ఇందిరానగర్ లో స్థానిక బస్తీ దవాఖానకు బ్లూ స్టార్ వాటర్ ప్యూరిఫైర్‌ను, అంగన్‌వాడి పాఠశాలకు రైస్ కుక్కర్‌ను యువ నాయకుడు కాట్ల చంద్రశేఖర్ రెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, పిల్లల పోషణ, విద్యా సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ఈ సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడం తమ బాధ్యత అని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని, ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, పోషణ రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్ర‌మంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here