శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆదిత్య నగర్ సెక్టార్‌లో ఉన్న న్యూ హఫీజ్‌పేట ప్రేమ్ నగర్ అంగన్ వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ లో భాగంగా సామూహిక శ్రీమంతాలు, అన్న ప్రాసన, సుపోషణ్, అక్షరాభ్యాసం, ఆరోగ్య దివస్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆదిత్య నగర్ సెక్టార్ సూపర్ వైజర్ ఠాకూర్ కోమలాబాయి హాజరై మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి సమతుల్య ఆహారం, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. శిశువులకు తల్లులు కనీసం 6 నెలల వరకైనా రొమ్ము పాలు ఇవ్వాలని, 7వ నెల నుంచి అంగన్ వాడీ కేంద్రంలో ఇచ్చే గుడ్డు, బాలామృతం తినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మీకాంతం, శైలజ, షీబా, సహాయకురాలు బేబీరాణి, కాలనీవాసులు పాల్గొన్నారు.






