శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం గ్రామం సుభాష్ నగర్ కాలనీలో తారా నగర్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ అడిషనల్ డివిజన్ ఇంజనీర్ శివప్రసాద్, AE హుస్సేన్, లైన్మెన్లు రాజు, ఆంజనేయులు, ఇతర సిబ్బంది పర్యటించి స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫామ్స్, కేబుళ్లు, వైర్లు, ఎలక్ట్రిక్ స్తంభాలు మార్చాలని స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దొంతి శేఖర్ ముదిరాజ్, గొంగుల రవికుమార్, శ్రావణ్ కుమార్, గోపి, సాయి కిషోర్, వీరేందర్ పాల్గొన్నారు.






