టిప్ప‌ర్ ఢీకొని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): టిప్ప‌ర్ వాహ‌నం ఢీకొని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. బుధ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో మియాపూర్ నుంచి లింగంప‌ల్లి వైపు వెళ్తున్న ఓ వ్య‌క్తిని మార్గ మధ్య‌లో అర్చ‌న హాస్పిట‌ల్ ఎదురుగా ర‌హ‌దారిపై ఓ టిప్ప‌ర్ వాహ‌నం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన‌ అత‌న్ని స్థానికులు చికిత్స నిమిత్తం స‌మీపంలో ఉన్న పీఆర్‌కే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో అత‌ను హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here