శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మహాత్మా గాంధీ విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో డీసీ శశిరేఖ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలతో కలిసి గాంధీ విగ్రహానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ చందానగర్ బస్‌స్టాప్ వద్ద గతంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని PJR స్టేడియంలో పునఃప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. రోడ్డు విస్తరణ, కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా బస్‌స్టాప్ వద్ద నుండి తొలగించిన గాంధీ విగ్రహాన్ని పీజేఆర్ స్టేడియంలో పునఃప్రతిష్ట చేశామని తెలిపారు. అహింసా మార్గంలో నడిచి, సత్యాన్ని ఆయుధంగా మార్చి దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయనకి హృదయపూర్వక నివాళులు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేట్లరు, నాయకులు , కార్యకర్తలు, మహిళలు , కాలనీల అసోసియేషన్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






