శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్‌గా ఉప్పలపాటి శ్రీకాంత్ పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన పదవీకాలం మొత్తం ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్యపై నిబద్ధతతో పోరాడానని తెలిపారు. ప్రజాసేవ తనకు కేవలం బాధ్యత మాత్రమే కాకుండా ఒక గౌరవమైన అవకాశమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నిరంతర సహకారంతో మియాపూర్ డివిజన్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పౌర సమస్యలను విజయవంతంగా పరిష్కరించగలిగామని, మియాపూర్ డివిజన్‌లో ఇంకా కొన్ని అభివృద్ధి పనులు మిగిలి ఉన్నాయని, వాటి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. పదవి లేకపోయినా ప్రజల పట్ల తన అంకితభావం, సేవా సంకల్పం ఎప్పటికీ కొనసాగుతాయని భరోసా ఇచ్చారు.






