శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్, నెహ్రూనగర్, బాపునగర్, పలు బస్తిలలో గత కొంత కాలంగా లోప్రెషర్ త్రాగు నీరు వస్తున్నాయని, తమకు హై ప్రెషర్ త్రాగునీటి సదుపాయం కల్పించాలని బస్తీ వాసులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని కోరారు. అందుకు కార్పొరేటర్ స్పందిస్తూ.. తక్షణ చర్యలు చేపట్టి బస్తీవాసులకు మెరుగైన త్రాగునీటి సదుపాయం కల్పించాలనే సంకల్పంతో ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో చర్చించి గోపి నగర్ గుట్ట ప్రాంతంలో, నెహ్రూ నగర్ పరిసర బస్తీ వాసులకు హై ప్రెషర్ త్రాగునీటి సదుపాయం కోసం బూస్టర్ ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. డివిజన్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని అందులో భాగంగా ప్రధానంగా లోప్రెషర్ త్రాగు నీటి సమస్యను ఆదిగమించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహాయ సహకారాలతో డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిజిఎం నరేందర్, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకుడు యాదా గౌడ్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, గఫుర్, విష్ణువర్ధన్ రెడ్డి, కొయ్యడ లక్ష్మణ్, యాదవ్, రవి యాదవ్, రాజ్ కుమార్, నరసింహ రెడ్డి, శ్రీకాంత్, నరసింహ, మహేందర్ సింగ్, దస్తగిర్, షకీల్, సాయన్న, సత్యనారాయణ, రవి, ముంతాజ్ బేగం, రేణు, మహేష్ చారీ, సలీం, సాయి, మహేష్, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.





