శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో సోమవారం సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ డి.శశిరేఖ, రెవెన్యూ సెక్షన్ ఏఎంసీ భిక్షపతి, ఏసీపీ రాణి, డీఈ (SWM) వశీధర్, ఏఎంవోహెచ్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఎస్ శ్రీనివాస్, ఇంజినీరింగ్ సెక్షన్ శ్రీదేవి, ఎంటమాలజీ సెక్షన్ ఆర్.చిన్నా, వెటర్నరీ సెక్షన్ టి.సంజయ్ రెడ్డి, యూబీడీ సెక్షన్ సతీష్ బాబు, యూసీడీ సెక్షన్ వీణ, ఎలక్ట్రికల్ సెక్షన్ శివ శంకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రజావాణిలో పలు అంశాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు, వినతిపత్రాలను అందజేశారు. టౌన్ ప్లానింగ్‌లో 16, ఇంజినీరింగ్ లో 5, యూబీడీలో 1, రెవెన్యూలో 2 మొత్తం కలిపి 24 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు DC శశి రేఖ ఆదేశాలు ఇచ్చారు.






