శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ రేగుల కుంట చెరువు ను సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రేగుల కుంట చెరువు కు దశ దిశ మారిందని, చెరువు స్వచ్ఛమైన జల సిరిని ఒడిసి పట్టుకొని కొత్త జీవ కళ ను సంతరించుకుందని అన్నారు. చెరువు కట్ట పై పూల మొక్కలు, పండ్ల మొక్కలతో పరిఢవిల్లుతూ సరికొత్త శోభను సంతరించుకుందని, చుట్టుపక్కల కాలనీల వాసులు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా కట్ట పై వాకింగ్ ట్రాక్ ఉపయోగపడుతుందని అన్నారు. మురికి కూపంలాంటి చెరువును స్వచ్చమైన మంచి నీరు లాంటి చెరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేసి చెరువును పునరుద్ధరణ చేసిన సందర్భంగా చెరువులో మురుగు నీరు కలవకుండా రూ.60 లక్షలతో చెరువు చుట్టూ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో మురుగు నీటి మళ్లింపు UGD నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






