శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): దశాబ్ద కాలంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మియాపూర్ మక్తా మహుబూబ్ పేట్ కు చెందిన కొంచ శివరాజ్ ముదిరాజ్ తన అనుచరులతో సహా బీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. శుక్రవారం కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొంచ శివరాజ్ కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక కార్యకర్తలు సుమారుగా 300 మంది బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఖాన్ గ్రేస్ అరాచక పాలనలో విసుగెత్తి పోయారని ఎద్దేవా చేశారు. రానున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడి, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు. ఈసందర్భంగా పార్టీ లో చేరిన కొంచ శివరాజ్ ముదిరాజ్ ను అభినందించారు. ఈసందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సేవకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ మహిళా నాయకులు రోజా, కొంచె ప్రేమ్ కుమార్, శ్రీధర్, కిరణ్, నర్సింగ్, సురేష్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.







