శేరిలింగంపల్లి డివిజన్ లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రూ.17 కోట్ల 33 లక్షల 80 వేలతో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్, రైల్ విహార్, హుడా ట్రేడ్ సెంటర్, నల్లగండ్ల ఫ్లై ఓవర్, సురభి కాలనీ, భాగ్యలక్ష్మి ఎన్‌క్లేవ్, మారుతి నగర్, మాధవ హిల్స్, స్ప్రింగ్ వ్యాలీ, వుడ్ ల్యాండ్ ప్రీమియర్, శిల్ప గార్డెన్, సెంట్రల్ పార్క్ ఫేస్ 1, సెంట్రల్ పార్క్ ఫేస్ 2, పెరల్ విలేజ్, క్యామ్లెట్ లే ఔట్, క్రాంతి వనం కాలనీల లో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, షటిల్ , బ్యాడ్మింటన్ , పార్క్ ప్రహరీ గోడ నిర్మాణం పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల లో రూ. 17 కోట్ల 33 లక్షల 80 వేలతో సీసీ రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీల వాసులకు ఉపశమనం లభించింద‌ని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని PAC చైర్మన్ గాంధీ అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామ‌ని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని , నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత , సుఖవంతమైన , మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయ శక్తులా కృషి చేస్తానని, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు.

కమ్యూనిటీ హాల్ లో కాలనీ వాసులు చిన్న చిన్న సమావేశాలు, సభలు, బర్త్ డే ఫంక్షన్ లు నిర్వహించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంద‌ని, కమ్యూనిటీ హాల్ ను కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని , అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని , మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, శేరిలింగంపల్లి డివిజన్, శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here