శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ శ్రీ శ్రీ శ్రీ అలివేలుమంగా గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లో పంచాదశ (15 వ) వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య తిరుకళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ గా జరిగిందని, వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి వారి కృప ప్రజలందరి పై ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, రాధాకృష్ణ, సుబ్రమణ్యం, రామచంద్రారెడ్డి, కృష్ణ రెడ్డి, సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






