నూతన పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారి ఇందిరాగాంధీ విగ్ర‌హం వద్ద మంజీరా పైప్ లైన్ పగిలి నిత్యం రోడ్డుపైకి నీరు రావడంతో కాలనీ వాసులు, వ్యాపారులు గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న సమస్యను పరిష్కరించే విధంగా రూ.17.20 లక్షల నిధులతో నూతన పైప్ లైన్ ను నిర్మించేందుకు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జల మండలి అధికారులతో కలిసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, పి.ఎ.సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ, జల మండలి అధికారుల సహకారంతో సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుందని అన్నారు. ఇంతకు ముందు ఉన్న పైప్ లైన్ పగలడంతో సమస్య ఏర్పడిందని, పైప్ లైన్ డివైడర్ కింద ఉండడంతో మరమ్మత్తు చేయడానికి వీలు లేకుండా పోయిందని, సుమారు నూటయాభై మీటర్లు నూతన పైప్ లైన్ ను నిర్మించి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గుడ్ల శ్రీనివాస్, గోపాల్, లింగం, రమేష్, నాగార్జున, వాటర్ వట్క్స్ మేనేజర్ ఝాన్సీ, వర్క్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here