మియాపూర్ స‌ర్కిల్ ప్ర‌జావాణికి 13 ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ స‌ర్కిల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ డి. శశి రేఖ అధ్యక్షత వహించగా, రెవెన్యూ విభాగం నుంచి ఏఎంసీ మని కరణ్, ఏసీపీ రాణి , డీఈ (ఎస్‌డబ్ల్యూఎం) వశిధర్ , ఏఎంఓహెచ్ శ్రీకాంత్ రెడ్డి , ఎస్‌ఎస్ శ్రీనివాస్ , ఇంజినీరింగ్ విభాగం నుంచి శ్రీదేవి , ఎంటమాలజీ విభాగం ఆర్. చిన్న , వెటర్నరీ విభాగం నుంచి టీ. సంజయ్ రెడ్డి , యూబీడీ విభాగం నుంచి అమృతమ్మ , యూసీడీ విభాగం నుంచి ఏ. విజయలక్ష్మి , ఎలక్ట్రికల్ విభాగం నుంచి శివ శంకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకుని, వాటిని ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు డిప్యూటీ కమిషనర్ శశి రేఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 13 ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినవి – 9, ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించినవి – 1, ఎంటమాలజీ విభాగానికి సంబంధించినవి – 1, శానిటేషన్ విభాగానికి సంబంధించినవి – 2 వ‌చ్చాయి. ప్రజావాణి వేదికగా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడంపై సంతృప్తి వ్యక్తం చేయగా, అధికారులు కూడా బాధ్యతాయుతంగా స్పందిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here