పోటీచేసే అవకాశం కాంగ్రెస్ అధిష్టానం చూస్తుంది: పీఏసీ ఛైర్మ‌న్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంటుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మ‌న్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంప‌ల్లి నియోజకవర్గం లోని శ్రీ రామ్ నగర్ ఏ బ్లాక్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బలరాం యాదవ్ త‌న‌ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే గాంధీని క‌లిసి తనకు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ పోటీచేసే అవకాశం కాంగ్రెస్ అధిష్టానం చూస్తుందని, తాను కేవలం ప్రతిపాదనలు చేసి పంపడం వరకే తన పాత్ర ఉంటుందని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవచేసే వారికి పార్టీ తప్పకుండా అవకాశం ఇస్తుందని అన్నారు. ఈ సారి ఎన్ని కల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here