శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల , నల్లగండ్ల హుడా కాలనీ, నవోదయ కాలనీ, సైబర్ కమ్యూన్ కాలనీలలో రూ. 9 కోట్ల 50 లక్షల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే అంతర్గత డ్రైనేజి పైప్ లైన్, కాలనీల ఔట్ లెట్, ( STP కి కలిపే ఇన్ లెట్) పైప్ లైన్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. తాగు నీటి సరఫరా , మురుగు నీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్స్ విభాగం అధికారులు CGM పద్మజ, GM వాస సత్యనారాయణ, DGM భార్గవి, జలమడలి GM DGM వాస సత్యనారాయణ, జలమండలి GM కృష్ణ, DGM నరేందర్, మేనేజర్ అభిషేక్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్‌లో..
మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్, ప్రగతి ఎనక్లేవ్, HMT స్వర్ణపురి కాలనీ, BK ఎనక్లేవ్, న్యూ కాలనీ, మయూరి నగర్ కాలనీలలో రూ. 2 కోట్ల 17 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, కమ్యూనిటీ హల్ నిర్మాణ పనులకు, పార్క్ ప్రారంభోత్సవంకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






