శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని గచ్చిబౌలి ఫేస్ 4 తెలంగాణ స్టేట్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే సీడిపి ఫండ్స్ ద్వారా నూతనంగా నిర్మించిన ఎంఐజి అల్లోటీస్ రెసిడెన్షియల్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ ను పిఏసీ ఛైర్మన్, శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఇటీవలే అకాల మరణం చెందిన సురేందర్ ఆత్మ శాంతించాలని కాలనీవాసులతో కలిసి ఒక నిమిషం మౌనం పాటించారు. కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి ప్రజలు ఖర్చులను తగ్గించుకునే విధంగా శుభాకార్యాలకు హాలు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, ప్రెసిడెంట్ వెంకటయ్య, సెక్రటరీ వెంకటేశ్వర్రావు, ట్రెజరర్ రియాజ్, వైస్ ప్రెసిడెంట్ జానీ బాబా, జాయింట్ సెక్రటరీ సంపత్ రావు, జోర్జ్, పాస్టర్ రాజ్ కుమార్, సయ్యద్ నయీమ్, ఈసీ మెంబర్స్ గంగాధర్, సాయిలేష్, కల్పన ఠాకూర్, మధుసూదన్ రెడ్డి, పద్మారావు ఇస్మాయిల్, చాంద్ పాషా, రఘురామం, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





