డీఎస్‌పీ వంశీ మోహ‌న్ రెడ్డికి మెరిటోరియ‌స్ స‌ర్వీస్ మెడ‌ల్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. పోలీస్, ఫైర్, హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్, జైళ్ల శాఖలో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 982 మందికి కేంద్రం అవార్డులు ప్రకటించింది. ఇందులో 125 గ్యాలంట్రీ, 101 మంది రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్స్, 756 మెరిటోయిస్ సర్వీస్ మెడల్స్ ఉన్నాయి.తెలంగాణకు 23 దక్కాయి. పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన 15 మందిని పోలీస్ మెడల్స్ వరించాయి. ఒకరికి గ్యాలంట్రీ మెడల్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్, మరో 12 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి.

మెరిటేరియస్ సర్వీస్ మెడల్ దక్కించుకున్న డి.ఎస్.పి వంశీ మోహన్ రెడ్డి

హైదరాబాద్ డి.ఎస్.పి వంశీ మోహన్ రెడ్డికి మెరిటోరియస్ అవార్డు దక్కింది. వారికి కేంద్ర ప్రభుత్వ విశిష్ట అవార్డు దక్కడం పట్ల తోటి పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. తన సేవలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు వంశీ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో వారు ఈ అవార్డును అందుకోనున్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here