శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): BHEL Township లోని శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కవిత అధ్యక్షత వహించారు. అలాగే ముఖ్య అతిథిగా డాక్టర్ పూలపల్లి వెంకటరమణ (విశ్రాంత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్) హాజరై విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువత ఫార్మ్ నెంబర్ 6ను నింపి ఓటరుగా నమోదు చేసుకొని ఓటింగ్ లో పాల్గొని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అందరిచేతా ఓటుహక్కును పొందుతామని, ఓటింగులో పాల్గొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అభిజిత్, అధ్యాపకులు డాక్టర్ అనురాధ, ప్రజ్వల, జనార్దన్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






